WFH Survey 2025: వర్క్ ఫ్రమ్ హోం సర్వే ఎవరికి చేస్తున్నారు?, ప్రయోజనాలేంటి? పూర్తివివరాలు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Last Updated on March 23, 2025 by AP Varthalu

WFH Survey 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం Work From Home (WFH) ఉద్యోగాలను ప్రోత్సహించేందుకు AP Work From Home Survey 2025 నిర్వహిస్తోంది. ఈ సర్వే ద్వారా యువతకు స్వగ్రామంలోనే ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మార్గం సుగమం అవుతుంది.

ఈ సర్వే ముఖ్యంగా ఇంట్లోనే ఉద్యోగం చేయాలనుకునే ఐటీ, ఇతర రంగాల ఉద్యోగులకు ఉపయోగపడుతుంది. ప్రభుత్వానికి ఉద్యోగులకు ఎదురయ్యే సవాళ్లు, అవసరమైన మౌలిక వసతులు, ప్రయోజనాలపై స్పష్టమైన అవగాహన లభించేందుకు ఈ సర్వే ఉపయోగపడుతుంది..

AP WFH Survey 2025 Full Details In Telugu
ఏపీ రైతులకు భారీ శుభవార్త: మళ్లీ ప్రారంభమైన రాయితీ ఎరువుల పథకం!..అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

Work From Home Survey Benefits

స్వగ్రామంలో ఉద్యోగ అవకాశాలు – నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంటి వద్ద నుంచే పని చేసే అవకాశం.
రద్దీ తగ్గింపు – నగరాల్లో ట్రాఫిక్, గృహ అద్దె, ఇతర ఖర్చులు తగ్గుతాయి.
పర్యావరణ పరిరక్షణ – ప్రయాణం తగ్గడంతో కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.
ప్రత్యామ్నాయ ఐటీ హబ్‌ల అభివృద్ధి – విశాఖ, తిరుపతి, రాజమండ్రి వంటి ప్రాంతాల్లో ఐటీ మౌలిక వసతులు అభివృద్ధి అవుతాయి.

AP Work From Home Survey Eligibility

ఈ సర్వే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 18 నుండి 50 సంవత్సరాల వయస్సు కలిగిన వారందరికీ మాత్రమే ఉంటుంది. అయితే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో పేరు నమోదైన వారికి మాత్రమే ఈ సర్వే జరుగుతుంది.

AP Work From Home Survey 2025 Full Details In Telugu ఏపీలో పెన్షనర్లకు భారీ షాక్ – 22,975 మంది లబ్దిదారుల పేర్లు తొలగింపు!

How To Enroll AP WFH Survey 2025

🔹 ఈ సర్వే కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లేదు.
🔹 కేవలం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల లాగిన్ ద్వారా మాత్రమే సర్వే చేయబడుతుంది.
🔹 ఎవరికైనా సర్వే చేయించుకోవాలంటే, సంబంధిత సచివాలయ ఉద్యోగిని సంప్రదించి వారు తమ GSWS మొబైల్ యాప్ ద్వారా మీ సమాచారాన్ని నమోదు చేస్తారు.

Questions In AP Work From Home Survey 2025

  1. విద్యార్హత ఏమిటి ?
  2. ప్రస్తుతం పని చేస్తున్నారా లేదా ?
  3. ప్రస్తుతం పని చేస్తున్నట్లయితే వర్క్ ఫ్రం హోం సదుపాయం ఉన్నటువంటి ఏ రంగంలో పనిచేస్తున్నారు. ?
  4. వర్క్ ప్రొఫైల్ కింద ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నారా ? ఆఫీస్ వద్ద నుండి పనిచేస్తున్నారా ? లేదా హైబ్రిడ్ మోడల్ లో కొంతకాలం ఇంటి వద్ద కొంతకాలం ఆఫీస్ లో పనిచేస్తున్నారా ?
  5. ఇంటి వద్ద నుండి పనిచేస్తున్నట్టయితే మీ ఇంటిలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ ఉన్నదా ?
  6. వర్క్ ఫ్రొం హోమ్ అవకాశం ఉన్నట్టయితే మీ ఇంటిలో బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అవకాశం ఉందా ?
  7. బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ ఉంటే మీకు ఎంత స్పీడ్ తో ఇంటర్నెట్ సదుపాయం ఉంది ?
  8. మీ ఇంట్లో వర్క్ ఫ్రం హోం కింద మీ స్నేహితులకు లేదా మీ కొలీగ్ / మీ తోటి ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సదుపాయం కొరకు ఇంట్లో ప్లేస్ లేదా సపరేట్గా రూమ్ ఉన్నదా ?
  9. ఉంటే ఆ రూమ్ యొక్క కొలత ?
  10. ఎంతమంది వరకు వర్క్ ఫ్రం హోం కింద ఆ రూమ్ లో పనిచేయటం అవకాశం ఉంటుంది ?
  11. ప్రస్తుతం పని చేయకపోతే ఏదైనా ఫీల్డ్ లో పనిచేయుటకు ఇష్టం ఉన్నదా ?
  12. పనిచేయటం ఇష్టం ఉంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ హాజరు అవుతారా ?

AP Work From Home Survey 2025 Benfits and official Web site Link ఏపీలోని పురుషులకు గొప్ప శుభవార్త…ఏప్రిల్ 1 నుండి ప్రారంభం

AP Work From Home Survey 2025 ద్వారా రాష్ట్ర ఉద్యోగులు ఇంట్లోనే పని చేసే అవకాశం పొందవచ్చు. ఇది స్వగ్రామ అభివృద్ధి, ఉద్యోగ అవకాశాలు, మరియు జీవన విధానాన్ని మెరుగుపరిచే ప్రభుత్వ ఉత్తమ ప్రణాళికల్లో ఒకటిగా మారనుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీ గ్రామ/వార్డు సచివాలయ అధికారిని సంప్రదించండి.

Tags: AP Work From Home Survey 2025, Work From Home Survey AP, AP WFH Survey, Work From Home AP, AP GSWS Survey

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల వివరాలు మరియు రాష్ట్రానికి సంబందించిన తాజా సమాచారం అందరికంటే ముందుగా మీ మొబైల్ కి రావడానికి ఇప్పుడే మా వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపు లలో జాయిన్ అవ్వండిి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Comment

WhatsApp